Kodali Nani
మాజీ మంత్రి కొడాలి నానిని రౌండప్ చేశారా? పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయి. కొడాలి నానికి బిగ్ షాక్ ఇస్తూ ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. కొడాలి నాని అనుచరులకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.
వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నాని అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటుగా లిక్కర్ గోడౌన్ వ్యవహారంలోనూ బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు..
Also Read : ఏం జరుగుతోంది? వైఎస్ వివేకా కేసులో సాక్షుల వరుస మరణాలపై క్యాబినెట్ లో కీలక చర్చ..
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నానిపై గుడివాడ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తన తల్లి మరణానికి కారణం అయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బెవరేజస్ ఎండీ వాసుదేవ రెడ్డి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్న మాధవీలత రెడ్డి తదితరులపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో వారు కోర్టుకు వెళ్లడంతో 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. తాజాగా ఇవే ఆరోపణలపై నాని అనుచరులకు 41ఏ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.
Also Read : కృష్ణా జిల్లా నుంచి శాసన మండలికి వెళ్లేదెవరు? పార్టీకి దక్కే నాలుగు సీట్లలో ఛాన్స్ ఎవరికి?
మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోందని చెప్పాలి. గతంలో ఆయనపై ఉన్న కేసులను పూర్తి స్థాయి విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.