Prabhas Marriage: హీరో ప్రభాస్ పెళ్లి మ్యాటర్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. డార్లింగ్ పెళ్లి చేసుకుంటారా? లేదా? ఎప్పుడు చేసుకుంటారు? పెళ్లి కూతురు ఎవరు? అనేదాని గురించి నిత్యం డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి డిస్కషన్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనేదానికి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభాస్ పెళ్లి విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన పెద్దమ్మ శ్యామాలాదేవి. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన కృషంరాజు సతీమణి శ్యామలాదేవి.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి కోసం పూజలు చేశారామె.
మీరంతా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతుంటారు, తప్పకుండా బాబు పెళ్లి జరుగుతుందని శ్యామలాదేవి చెప్పారు. ప్రభాస్ పెళ్లి జరగాలని అమ్మవారిని, స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె తెలిపారు. పెళ్లి కూతురు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తా లేక కుటుంబ సభ్యురాలా అన్నది తెలియదన్నారు. ప్రభాస్ కు పెళ్లి మాత్రం జరుగుతుందన్నారు.
ఏడాదిలో పెళ్లి జరుగుతుందా? అని మీడియా ప్రశ్నించగా శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదుగా, శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి జరుగుతుందని ఆమె చెప్పారు. ”ప్రభాస్ పెళ్లి చేయాలని మాకూ ఉంది. కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శివుడు అనుగ్రహిస్తే, ఆయన ఏ రోజు అనుకుంటే ఆరోజు వివాహం జరుగుతుంది” అని శ్యామలాదేవి అన్నారు. శ్యామలాదేవి వ్యాఖ్యలతో మరోసారి ప్రభాస్ పెళ్లి గురించిన చర్చ తెరమీదకు వచ్చింది. డార్లింగ్ త్వరగా వివాహం చేసుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
కృష్ణంరాజుతో కలిసి పలుసార్లు ద్రాక్షారామంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం కృష్ణంరాజుకు ఎంతో ఇష్టం అని చెప్పారు. కృష్ణంరాజు ఈ ఆలయం చరిత్ర గురించి చెబుతూ ఈ ఆలయం సామాన్యులు నిర్మించినది కాదని, దేవ నిర్మాణం అని తనతో చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు కృష్ణంరాజు విద్యను అభ్యసించిన పెద్దాప్పురపాడు హైస్కూల్ ను శ్యామలాదేవి సందర్శించారు.