Simhagiri Pradakshina
Ashok Gajapati Raja : ఆదివారం సింహాచలం సింహగిరి ప్రదక్షిణ జరుగనుంది. 32 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. కొండ కింద తొలి పావంచా వద్ద పుష్ప రథానికి దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Tirumala : జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు
ఆదివారం కావడంతో గతం కంటే ఎక్కువ మంది పాల్గొంటారని అధికారుల అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 2,100 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 10గంటల వరకు స్వామి వారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఆదివారం, సోమవారం ఆర్జిత సేవలు రద్దు చేశారు.