Tirumala : జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు

ఆదివారం 87 వేల 407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.47 కోట్లు ఆదాయం వచ్చింది.

Tirumala : జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు

Tirumala (3)

Updated On : June 26, 2023 / 11:20 AM IST

Tirumala Special Festivals : తిరుమలలో జులై మాసంలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ పీఆర్ఓ విభాగం ఉత్సవాల వివరాలను ప్రకటించింది. జులై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తు మొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేయడం, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని పేర్కొంది.

కాగా, శనివారం శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ అధికమైంది. అర్ధరాత్రి వరకు 83వేల 889 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.3.10 కోట్లు సమర్పించుకున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటించింది.

Srivari Temple : తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయం.. భూమి పూజ చేసిన అర్చకులు

ఆదివారం 87 వేల 407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.47 కోట్లు ఆదాయం వచ్చింది. తిరుమల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.