Sri Varaha Lakshmi Narasimha Swamyvari Chandanotsavam
Sri Varaha Lakshmi Narasimha Swamyvari Chandanotsavam : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి నిజరూపదర్శనం ఈ ఏడాది ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. ప్రతీయేటా వైశాఖ శుద్ధ తదియ నాడు నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత వైభవోపేతంగా జరిపించేందుకు ఆలయ వర్గాలతో కలిసి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.
Also Read : Silver Wedding Card: వారెవ్వా.. 3కిలోల వెండి, 25లక్షల ఖర్చుతో వెడ్డింగ్ కార్డ్..
సింహాచలం దేవాలయంలో జరిగే అతిపెద్ద ఉత్సవాలలో చందనోత్సవం ఒకటి. ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రినాదుడు ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు విజరూప దర్శనమిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 20న నిర్వహించనున్న చందనోత్సవానికి సంబంధించి పటిష్టవంతంగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. మంగళవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు.
సాంప్ర దాయం ప్రకారం దేవాలయ అనువంశిక ధర్మకర్త. టీటీడీ నుంచి పట్టువస్త్రాలు సమర్పించేవారికి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు కల్పించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, స్లాట్ల ప్రకారం భక్తులకు దర్శనాలకు అనుమతించాలని స్పష్టం చేశారు. 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామనే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియపర్చాలని మంత్రి అధికారులకు సూచించారు.
రూ.1500, రూ.1,000, రూ.300 ధరల మేరకు టిక్కెట్ల జారీ ప్రక్రియను ప్రణాళికాయుతంగా చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. టిక్కెట్‌పై క్యూఆర్ కోడ్ వచ్చేలా రూపొం దించాలని, దర్శనాల సమయంలో స్కాన్ చేసేందుకుగాను స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిబ్రవరిలో జరగబోయే మలివిడత సమీక్షా సమావేశంనాటికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని, ఈలోపు అధికారులంతా సంయుక్త క్షేత్రస్థాయి సందర్శన చేసి ఏర్పాట్లపై సమీక్షించుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కొండపైకి వాహన రాకపోకలను గణనీయంగా తగ్గించాలని, పరిమిత సంఖ్యలో వెహికల్ పాస్ లు జారీ చేయాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తుల కోసం తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని, క్యూల్లో విరివిగా తాగునీటి కేంద్రాలను, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 28 నాటికి ఆలయంలో అన్ని సివిల్ వర్కులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.