YS Jagan Mohan Reddy (Photo : Twitter, Google)
YS Jagan Mohan Reddy : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకోసం ప్రజల బాట పట్టాయి వైసీపీ, టీడీపీ. యాత్రల పేరుతో రెండు పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి దిగారు.
నిజం గెలవాలి పేరుతో టీడీపీ, సామాజిక సాధికార యాత్ర పేరుతో అధికార వైసీపీ ప్రజల మధ్యకు వెళ్లాయి. తాజాగా అనంతపురము జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో వైసీపీ నేతలు మాట్లాడారు. చంద్రబాబు, టీడీపీ నేతలు టార్గెట్ గా నిప్పులు చెరిగారు.
Also Read : కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా? బుద్ధా వెంకన్న
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాయమాటలు నమ్మొద్దు- నందిగం సురేశ్
వైఎస్ జగన్ పాతికేళ్లు సీఎంగా ఉంటే పేద విద్యార్థులు ఉన్నత పదవులు అధిరోహిస్తారు అని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు మాయా ప్రపంచం సృష్టించారని మండిపడ్డారు. జగన్ ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదన్నారు ఎంపీ నందిగం సురేశ్. జగన్ ను ఎదుర్కోవడం లోకేశ్ చేత కాదన్నారు. న్యాయం గెలిపించాలని భువనేశ్వరి అడగాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు విషయంలో న్యాయం గెలుస్తుంది, చట్టం కూడా గెలుస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాయమాటలు నమ్మొద్దని ప్రజలకు కోరారు ఎంపీ నందిగం సురేశ్.
వాళ్లు ఎన్ని యాత్రలు చేసినా జగన్ జైత్రయాత్ర ఆపలేరు- గోరంట్ల మాధవ్
పవన్ కల్యాణ్, భువనేశ్వరి ఎన్ని యాత్రలు చేసినా జగన్ జైత్రయాత్ర ఆపలేరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అగ్రభాగాన నిలబెట్టిన ఘనత జగన్ దే.
వెనుకబడిన వర్గాలు సీఎం జగన్ కి అండగా నిలవాలి.
మళ్లీ జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి- మంత్రి ఉషాశ్రీచరణ్
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరుగుతున్న మంచిని ప్రజలు చూడాలి. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. సీఎం జగన్ వల్లే మహిళా సాధికారత సాధ్యం. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది. టీడీపీ హామీలు నమ్మవద్దు.
జగన్ పాలన దేశానికే ఆదర్శం- మంత్రి గుమ్మనూరు జయరాం
జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తున్నారు. అబద్ధపు హామీలతో మరోసారి మోసం చేసేందుకు టీడీపీ-జనసేన సిద్ధం అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 2లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం. పేదలకు అండగా జగన్ ప్రభుత్వం ఉంది. జగన్ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం.
Also Read : కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము
ముస్లిం మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఓ చరిత్ర- డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
టీడీపీ పాలనలో సామాజిక సాధికారత నిర్లక్ష్యానికి గురైంది. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకులా చూశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే. ఏపీలో ముస్లిం మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఓ చరిత్ర. మాకు ప్రజలతోనే పొత్తు.