Venigandla Ramu : కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము

గుడివాడ అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కొడాలి నాని మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రోడ్లపై ఉన్న గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నా ఎమ్మెల్యేకు అనవసమని విమర్శించారు.

Venigandla Ramu : కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము

Venigandla Ramu criticized Kodali Nani

Updated On : October 25, 2023 / 8:22 PM IST

Venigandla Ramu – Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ టీడీపీ, జనసేన నేతలు ఫైర్ అయ్యారు. పనికిమాలిన వాగుడు వాగుతున్న కొడాలి నాని పనైయిపోయిందని టీడీపీ నేత వెనిగండ్ల రాము విమర్శించారు. 8వ క్లాస్ చదివిన నానికి హెరిటేజ్ లాంటి సంస్థ గురించి ఎలా తెలుస్తోందన్నారు. ఇకనైనా పనికిమాలిన వాగుడు మానుకోవాలని హితవు పలికారు.

ఏం చేయకపోయినా కోట్ల రూపాయల కార్లు ఎలా కొంటున్నావని ప్రశ్నించారు. వంగవీటి రాధా పెళ్ళిలో పవన్ కళ్యాణ్ తో కరచాలనం కోసం ఏ స్థాయికి దిగజారావో అందరూ చూశారని తెలిపారు. నీవు పశువువని తెలిసినా మానవత్వం ఉన్న పవన్ కళ్యాణ్ నీతో కరచాలనం చేశారని కొడాలి నానిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

Nara Bhuvaneswari : చంద్రబాబును కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్బంధించారు : నారా భువనేశ్వరి

గుడివాడ అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కొడాలి నాని మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రోడ్లపై ఉన్న గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నా ఎమ్మెల్యేకు అనవసమని విమర్శించారు. ఏమీ చేతకాని వ్యక్తిని ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారని తెలిపారు. కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు.