Amit Shah : ఏపీలో 2024 అధికారం దిశగా బీజేపీ – సోము వీర్రాజు

2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.

Somu Veerraju, Purandeswari : 2024 అధికారం దిశగా అడుగులు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ కృషి చేయడం జరుగుతుందని, ఏపీలో గ్రామీణాభివృద్ధికి సహకారం అందిస్తామని షా చెప్పడం జరిగిందన్నారు. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం తిరుపతిలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయస్థాయి సమావేశం జరిగింది. అనంతరం సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరిలు షాతో భేటీ అయ్యారు.

Read More : BJP for Votes: దళితులతో కలిసి టీ తాగండి.. జాతీయత కోసం ఓట్లు అడగండి – యూపీ బీజేపీ చీఫ్

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడడం జరుగుతుందని, ఏపీలో బీజేపీ బలోపేతం, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుధీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. ఏపీ విభజన బిల్లు అంశాలు, విభజన బిల్లులోని 80 శాతానికి పైగా అంశాలను ఇప్పటికే కేంద్రం నెరవేర్చిందన్నారు. మిగిలిన అంశాలపై కూడా చర్చించినట్లు, ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదని ఆరోపించారు.

Read More : Peanut Crop : వేరుశనగ పంటను ఆశించు పురుగులు – నివారణా చర్యలు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ఎపీకి చేరుకున్న దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం వచ్చిన ఆయనకు సీఎం వైఎస్‌ జగన్ స్వాగతం పలికారు. స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ఫౌండేషన్‌, 9వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు