BJP for Votes: దళితులతో కలిసి టీ తాగండి.. జాతీయత కోసం ఓట్లు అడగండి – యూపీ బీజేపీ చీఫ్

ఉత్తరప్రదేశ్ లోని మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లు కోసం పార్టీలు పలురకాలుగా రెడీ అవుతున్నాయి.

BJP for Votes: దళితులతో కలిసి టీ తాగండి.. జాతీయత కోసం ఓట్లు అడగండి – యూపీ బీజేపీ చీఫ్

Tea With Dalits

Updated On : November 15, 2021 / 3:31 PM IST

BJP for Votes: ఉత్తరప్రదేశ్ లోని మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లు కోసం పార్టీలు పలురకాలుగా రెడీ అవుతున్నాయి. ఈ సందర్భంగా యూపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ.. దళితులతో కలిసి టీ తాగండి. వాళ్లను కన్విన్స్ చేసి జాతీయత కోసం మన పార్టీకే ఓట్లు వేయమని చెప్పండి’ అని కామెంట్ చేశారు.

ఆదివారం జరిగిన వైశ్య సమాజ్ సమ్మేళనంలో భాగంగా.. ‘ ఓ 100మంది దళితులతో కలిసి టీ తాగండి. ఓట్లు జాతీయత కోసమేనని.. కులం, డబ్బు, ప్రాంతం ఆధారంగా ఉండకూడదని వివరించండి’ అని అన్నారు. ఈ ఈవెంట్ ను బీజేపీ నిర్వహించగా.. కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి పీయూష్ కూడా హాజరయ్యారు.

ఎన్నికల ముందు హిందూత్వం, హిందూయిజం అంశాలు డామినేటింగ్ గా మారడంతో.. దళితుల ఓట్లు కీలకం అయ్యాయి. ఇదే సమయంలో బీజేపీ.. సంవిధాన్ గౌరవ్ అభియాన్ యాత్ర అనే పేరుతో 75లొకేషన్స్ లో ర్యాలీ నిర్వహిస్తుంది.

…………………………….. : కందిసాగులో మేలైన విత్తన రకాలు