కృష్ణా జిల్లా చిన్నారికి సోనూసూద్ సాయం..

sonu sood:దేశవ్యాప్తంగా తాను చేస్తున్న మంచి పనులతో దేవుడిగా మారిపోయిన సినిమా నటుడు సోనూసూద్.. సామాజిక సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. అందరూ మెస్సయ్యగా కీర్తిస్తూ ఆయనకు గుడి కూడా కట్టారు. మరోసారి సోనూసూద్‌ చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం చేసి రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల 15 నెలల వయసు కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోండగా.. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితుల్లో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే విషయాన్నిజనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూసూద్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ముంబయిలోని హాస్పిటల్‌లో ఆపరేషన్ చేయడానికి అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయాలను అందించి ఆపరేషన్ చేయించారు. చికిత్స తర్వాత కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి మునుకుళ్లకు చేరుకుంది. ఈసందర్భంగా సోనూసూద్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.