SP Malika Garg : దళిత మహిళపై అమానుష దాడి ఘటన.. బాధితురాలి సోదరుడు ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కక్షతో దాడి : ఎస్పీ మల్లికా గర్గ్

మౌనిక సోదరుడి ఆచూకినీ బాధితుల నుండి చెప్పించడానికే ఈ దాడి చేసినట్లు వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో డయల్ 100కు కాల్ చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మౌనిక ప్రాణాలను రక్షించగలిగారని తెలిపారు.

Prakasam SP Malika Garg

Prakasam SP Malika Garg : ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత మహిళను వివస్రను చేసి దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి సోదరుడు అగ్రవర్గాల యువతిని ప్రేమపెళ్లి చేసుకున్నాడన్న కక్షతో యువతి తల్లిదండ్రులు మౌనికపై దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ మేరకు బుధవారం ఎస్పీ మాలికా గర్గ్ మీడియతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ బాధితురాలైన మౌనికపై దాడి చేశారని తెలిపారు. దళితురాలైన మౌనిక సోదరుడు గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తెను ప్రేమించి గత మార్చిలో పెళ్లి చేసుకున్నాడనే కక్షతోనే ఈ దాడి చేశారని పేర్కొన్నారు.

గతంలో కూడా బాధితులపై దాడి జరగగా నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. మరోసారి నిన్న (మంగళవారం) బాధితులపై దాడి చేయడంతో ఈ ఇద్దరు నిందితులపై మరోసారి కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఘటన ప్రీప్లాన్ గా అర్ధరాత్రి సమయంలో బాధితురాలు మౌనికపై నిందితులు దాడి చేశారని పేర్కొన్నారు.

constable who strangled the woman : మహిళ గొంతుకోసి హత్యాయత్నం చేసిన కానిస్టేబుల్

మౌనిక సోదరుడి ఆచూకినీ బాధితుల నుండి చెప్పించడానికే ఈ దాడి చేసినట్లుగా వివరించారు. దాడి జరుగుతున్న సమయంలో డయల్ 100కు కాల్ చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మౌనిక ప్రాణాలను రక్షించగలిగారని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా మౌనిక ప్రాణాలు గాలిలో కలిపోయేవని చెప్పారు. బ్రహ్మారెడ్డి మౌనికపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై రామకృష్ణ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానికి వెళ్లి దాడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటువంటి దాడులు, హత్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.