Tammineni Seetharam: తమ్మినేని సీతారాంకు అస్వస్థత

ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.

Speaker Tammineni Sitaram Hospitalized Due To Illness

Tammineni seetharam: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. సీతారాం రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆస్పత్రిలో చేరారు.

కరోనా వైరస్ బారిన ప‌డి సీతారాం దంపతులు మే 12వ తేదీన కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీతారాం కంటే ముందు భార్య వాణిశ్రీకి వైరస్ సోకగా.. దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ కోవిడ్ అనంతరం కూడా సీతారాం అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు.