TDP-Janasena: పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? ఈ 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం?

ఆ సీట్లలో రెండు పార్టీలకూ బలమైన అభ్యర్థులు ఉన్నారు. పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? త్యాగాలు చేయడానికి సిద్ధమవుతున్న నేతలు ఎవరు?

TDP-Janasena

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల పంచాయితీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 18 సీట్లపై ఇరుపార్టీల్లోనూ గందరగోళం నెలకొన్నట్లు సమాచారం. ఆ 18 సీట్లలో రెండు పార్టీలకూ బలమైన అభ్యర్థులు ఉన్నారు. పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు? త్యాగాలు చేయడానికి సిద్ధమవుతున్న నేతలు ఎవరు?

జనసేనకు కేటాయించే మొత్తం స్థానాలు ఎన్ని? జనసేన బలంగా ఉన్న మొత్తం స్థానాలు ఏవి? టీడీపీ-జనసేన కూటమిలో సీట్లలొల్లి ఎక్కడెక్కడ ఉంది? ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయనుంది? జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వనున్నారు? టీడీపీ సీట్లకు జనసేన ఎర్త్‌ పెడుతుందా? జనసేన కండీషన్లకు టీడీపీ భయపడుతుందా? ఇటీవల టీడీపీ- జనసేన రెండేసి స్థానాల్లో ఎవరికి వారే సీట్లు ప్రకటించడానికి కారణాలు ఏంటి? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీడీపీ-జనసేన కూటమిలో సీట్లలొల్లి ఈ స్థానాల్లో?

* తెనాలి- ఆలపాటి రాజా( టీడీపీ), నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
* పిఠాపురం-వర్మ( టీడీపీ), తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ లేదా ముద్రగడ( జనసేన)
* రాజానగరం- బొడ్డు వెంకటరమణ(టీడీపీ), బత్తుల బలరామకృష్ణ( జనసేన)
*అవనిగడ్డ- మండలి బుద్దప్రసాద్‌(టీడీపీ), రామకృష్ణ( జనసేన జిల్లా అధ్యక్షుడు)
*విజయవాడ వెస్ట్‌- బుద్దా వెంకన్న(టీడీపీ), పోతిన మహేశ్‌ ( జనసేన)
* గుంటూరు వెస్ట్‌- కోవెలమూడి రవీంద్ర(టీడీపీ), బోనబోయిన శ్రీనివాస యాదవ్‌( జనసేన)
* పెందుర్తి- బండారు సత్యనారాయణ(టీడీపీ), పంచకర్ల రమేశ్‌ ( జనసేన)
* భీమిలి-గంటా శ్రీనివాసరావు లేదా రాజాబాబు(టీడీపీ), పంచకర్ల సందీప్‌( జనసేన)
* నెల్లిమర్ల – బంగార్రాజు(టీడీపీ), లోకం మాధవి( జనసేన)
* ధర్మవరం- పరిటాల శ్రీరాం లేదా గోనుగుంట్ల సూర్యనారాయణ(టీడీపీ), మధుసూదన్‌ రెడ్డి( జనసేన)
* చీరాల- కొండయ్య యాదవ్‌(టీడీపీ), ఆమంచి స్వాములు( జనసేన)
* కాకినాడ- కొండబాబు(టీడీపీ), ముత్తా శశిధర్‌( జనసేన)
* అమలాపురం- ఆనందరావు(టీడీపీ), రాజబాబు( జనసేన)
* నర్సాపురం- బండారు మాధవనాయుడు(టీడీపీ), బొమ్మిడి నాయికర్‌ ( జనసేన)
* నర్సారావుపేట- నల్లపాటి రాము(టీడీపీ), సుభాణి ( జనసేన)
* పెడన- కాగిత కృష్ణప్రసాద్‌(టీడీపీ), బూరగడ్డ వేదవ్యాస్‌( జనసేన)
* రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ), కందుల దుర్గేశ్(జనసేన)
* తణుకు- అరుమిల్లి రాధాకృష్ణ(టీడీపీ), విడివాడ రామచంద్రరావు (జనసేన)
* ఉంగుటూరు- గన్ని ఆంజనేయులు (టీడీపీ), పి.దర్మరాజు (జనసేన)

Also Read: ఇక దేవుడు కూడా కాపాడలేడు.. సినిమా అయిపోయింది: జగన్‌పై చంద్రబాబు కామెంట్స్

మరిన్ని అంశాలపై 10 టీవీ స్పెషల్ రిపోర్ట్..

ట్రెండింగ్ వార్తలు