Araku Valley
Araku Valley : ఏపీ ఊటీగా పేరుగాంచిన అరకు లోయకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్తు కోస్తా రైల్వే తెలిపింది. ఉదయం 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి.. సింహాచలం. కొత్తవలస, ఎస్.కోట, బొర్రాగుహల మీదుగా 11.30కి అరకు లోయ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2.30గంటలకు అరకు నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.
చదవండి : Visakhapatnam IIM : విశాఖ ఐఐఎం లో పిజీపీ లో ప్రవేశాలు
08525 నంబరు రైలును ఈ మార్గంలో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకుల సౌకర్యార్ధం ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైలు నడపనున్నారు.
చదవండి : Visakha : అబ్బాయి కోసం రోడ్డుపైనే కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు