Visakha : అబ్బాయి కోసం రోడ్డుపైనే కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు

విశాఖ నగరంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఓ యువకుడిని ప్రేమించారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వేరే యువతితో మాట్లాడుతున్నప్పుడు బాలిక నిలదీసింది.

Visakha : అబ్బాయి కోసం రోడ్డుపైనే కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు

Girls

two girls hit for the boy : విశాఖలో ఓ ప్రేమ వ్యవహారం రచ్చకెక్కింది. ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సిగపట్లు పట్టారు. దీంతో చుట్టూ ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అమ్మాయిలతో పాటు ప్రియుడ్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…విశాఖ నగరంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఓ యువకుడిని ప్రేమించారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వేరే యువతితో మాట్లాడుతున్నప్పుడు ఒక బాలిక చూసి వారిద్దరినీ నిలదీసింది. ఈ క్రమంలో తామిద్దరం ప్రేమించుకుంటున్నామని..యువకుడు నిన్ను ప్రేమించడం లేదంటూ అమ్మాాయి చెప్పడంతో ఇద్దరు బాలికల మధ్య వాగ్వాదం నెలకొంది.

New York : బూస్టర్ డోసు తీసుకునేవారికి నగదు బహుమతి

నగరం నడిబొడ్డున కాలేజీ వేదికగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపైకి వచ్చిన ఇద్దరు బాలికలు…ఒక యువకుడి కోసం కొట్టుకున్నారు. మొదటగా వాగ్వాదానికి దిగి, ఆ తర్వాత బూతు పురాణంతో ఒకరికొకరు సిగ పట్లు పట్టుకున్నారు. ఈ వ్యవహారం శృతి మించడం, విద్యార్థులంతా అక్కడ గుమికూడంతో గమనించిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

బాలికలిద్దరూ మైనర్లు కావడంతో ఆ యువకుడిని కూడా పిలిపించి ముగ్గురికీ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పోలీసులు పంపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు.