New York : బూస్టర్ డోసు తీసుకునేవారికి నగదు బహుమతి

యూఎస్ లో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల న్యూయార్క్ నగరంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు.

New York : బూస్టర్ డోసు తీసుకునేవారికి నగదు బహుమతి

Booster Dose (1)

Updated On : December 22, 2021 / 12:16 PM IST

Cash prize for those who take booster dose : న్యూయార్క్ నగర మేయర్ బిల్ డీ బ్లాసియో నగర పౌరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పొందిన పౌరులకు నగదు ఇస్తామన్నారు. వారికి వంద డాలర్లు..అంటే దాదాపు 7,568 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. ఈ రివార్డుకు అర్హులైన వ్యక్తులు మూడో డోస్ టీకాను డిసెంబర్ 31వ తేదీ లోపు వేయించుకోవాలని సూచించారు.

‘ఇది గొప్ప అవకాశమని..బూస్టర్ డోస్ పొందండి.. మీ కుటుంబాన్ని, నగరాన్ని రక్షించుకోండి’ అని ట్వీట్ చేశారు. దీనికిముందు జులైలో కూడా న్యూయార్క్ నగరంలో సిటీ రన్ సైట్ లో టీకా మొదటి డోస్ పొందిన వ్యక్తులకు వంద డాలర్లు ఇచ్చారు. ఈ డబ్బు ప్రీపెయిడ్ డెబిట్ కార్డు లేదా ఈ మెయిల్ ద్వారా అందిస్తున్నారు.

Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన ఒమిక్రాన్ కేసులు.. బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 నమోదు

యూఎస్ లో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందటం వల్ల న్యూయార్క్ నగరంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు. గత ఏడు రోజులుగా న్యూయార్క్ నగరంలో సగటున 9,300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని డీబ్లాసియో తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు.