Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన ఒమిక్రాన్ కేసులు.. బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 నమోదు

బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61వేలకు చేరువైంది. ఇక డెన్మార్క్‌లో 26వేల 362 కరోనా కేసులున్నాయి.

Omicron Cases : ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిన ఒమిక్రాన్ కేసులు.. బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 నమోదు

World

one lakh Omicron cases worldwide : ఒమిక్రాన్… ఓ మై గాడ్ అనిపిస్తోంది. ప్రపంచ దేశాలను శరవేగంతో కమ్మేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. డెల్టా వేరియంట్‌ను మించిన దూకుడుతో పాకేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61వేలకు చేరువైంది. ఇక డెన్మార్క్‌లో 26వేల 362 కరోనా కేసులున్నాయి.

నార్వేలో 3వేల 9వందలు, కెనడాలో 2వేల 3వందలు, అమెరికాలో 15వందలు, దక్షిణాఫ్రికాలో 14వందలకు పైగా కేసులున్నాయి. అమెరికాలో కేసుల సంఖ్య 15వందలని అధికారికంగా ప్రకటించినా కొత్త కేసుల్లో 70శాతానికి పైగా ఒమిక్రానే అంటున్నారు. అక్కడ రోజుకు లక్షకు పైగా కేసులు వస్తున్నాయి. ఆ లెక్కన ఒమిక్రాన్ కేసులు వేలల్లో ఉండాలి. అయితే అధికారికంగా ఆ లెక్కలు ప్రకటించాల్సి ఉంది.

Omicron Death : ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

ఇజ్రాయెల్‌తో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మూడోడోస్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు, వైద్య సిబ్బందికి నాలుగోడోస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఫ్రాన్స్‌లో నమోదవుతున్న కొత్త కేసుల్లో 20శాతం ఒమిక్రానే అని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

బ్రిటన్‌లో కేసుల సంఖ్య రాకెట్‌లా దూసుకుపోతుండటంతో కట్టడి మార్గాలు అన్వేషిస్తోంది. క్ర్మిస్మస్‌ వేడుకల సమయంలో ఆంక్షలు పెడితే తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఉన్నారు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. అందుకే క్రిస్మస్‌ తర్వాత లాక్‌డౌన్ సహా కొన్ని చర్యలకు రూట్‌మ్యాప్‌ రెడీ చేశారు. స్కాట్‌లాండ్‌ ఇప్పటికే న్యూ ఇయర్‌ పార్టీలపై ఆంక్షలు పెట్టింది.

Omicron : అమెరికాలో ఒమిక్రాన్ పంజా.. 73శాతం కేసులతో డెల్టాను దాటేసింది!

ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా అల్లాడిపోతోంది. నమోదవుతున్న కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా ఉండటంతో దాన్ని కట్టడి చేయడంపై దృష్టిపెట్టింది. అధికారులు, వైద్య నిపుణులతో అధ్యక్షుడు జోబైడెన్‌ చర్చించారు. దేశవ్యాప్తంగా 50కోట్ల ఉచిత కోవిడ్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆసుపత్రులకు అదనపు సాయం చేయనున్నారు. వేయిమంది ఆర్మీ వైద్య సిబ్బందిని ఆసుపత్రుల్లో సేవలకు వినియోగించనున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోవడంతో ప్రజలు సాధ్యమైనంత త్వరగా బూస్టర్‌ డోస్‌లు తీసుకోవాలని బైడెన్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో టెస్టింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సెంటర్ల ముందు భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల 3గంటలకు పైగా పడుతోంది. మరోవైపు క్రిస్మస్‌ సంబరాలు కొనసాగుతున్నాయి. జనం భారీగా గుమికూడుతున్నారు. న్యూఇయర్‌ వేడుకలు కూడా రానున్నాయి. దీంతో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. న్యూఇయర్‌ సంబరాలు ముగిసేసరికి ఒమిక్రాన్ కేసులు వేలను దాటి లక్షల్లోకి చేరినా ఆశ్చర్యం లేదన్న అంచనాలున్నాయి.

Omicron Variant: నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన

అమెరికాలో కొత్త కేసుల్లో 73శాతం ఒమిక్రాన్‌వేనన్న అంచనాలూ ఉన్నాయి. దీంతో టెస్టింగ్‌ను మరింత పెంచాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో నిన్న ఒక్కరోజే లక్షా 81వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ కరోనా కొత్త కేసుల్లో దాదాపు 25శాతం వాటా అమెరికాదే… అత్యధికంగా న్యూయార్క్‌లోనే ఒక్కరోజులో 22వేల మందికి కరోనా సోకింది. ఇక నిన్న ఒక్కరోజే అమెరికాలో కరోనా మరణాలు 18వందలు దాటాయి.