Omicron Variant: నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్రం ఆరోగ్య శాఖమంత్రి రాష్ట్రాలకు కొన్ని సూచనలు ఇచ్చింది. నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలని చెప్పింది.

Omicron Variant: నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచన

Night Curfew In Andhrapradesh

Omicron Variant: ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్రం ఆరోగ్య శాఖమంత్రి రాష్ట్రాలకు కొన్ని సూచనలు ఇచ్చింది. నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలని చెప్పింది. జిల్లాల్లో 10శాతం పాజిటివిటీ రేటు ఉన్నా ఆక్సిజన్ సపోర్టెడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లను ఇంకా 40శాతం పెంచాలంటూ జాగ్రత్తలు విస్మరించకూడదని చెప్పింది.

హెల్త్ సెక్రటరీ లెటర్ లో పేర్కొన్న విధంగా ఒమిక్రాన్ వేరియంట్ .. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. ముందస్తు సూచనలు, డేటా విశ్లేషణ, డైనమిక్ డెసిషన్ తీసుకుని కఠినమైన కంటైన్మెంట్ యాక్షన్ తీసుకోవాలని స్థానికంగా, జిల్లా స్థాయిలో అధికారులకు సూచించారు.

ఇప్పటికే ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 200కంటే ఎక్కువ నమోదయ్యాయి. 77మంది రికవరీ అయ్యారని హెల్త్ మినిస్టరీ మంగళవారం చెప్పింది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా నమోదవుతూ.. కొత్త వేరియంట్ కేసులు 54వరకూ ఉన్నాయని చెప్పింది. తర్వాతి స్థఆనంలో తెలంగాణ (20 కేసులు), కర్ణాటక (19), రాజస్థాన్ (18), కేరళ (15), గుజరాత్ (14)కు చేరాయి.

………………………………..: ఓటీటీలోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్- సుఖేశ్ చంద్రశేఖర్ లవ్ స్టోరీ

గడిచిన 24గంటల్లో 5వేల 326 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 581రోజుల్లో అత్యల్పంగా నమోదైన కేసులివే. దేశంలో ఇప్పటివరకూ 3.48కోట్ల కేసులు లిస్ట్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.