Jacqueline Fernandez: ఓటీటీలోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్- సుఖేశ్ చంద్రశేఖర్ లవ్ స్టోరీ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కొద్ది రోజులుగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల్లో ఇరుక్కొని సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుందా అనుకుంటున్న తరుణంలో....

Jacqueline Fernandez: ఓటీటీలోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్- సుఖేశ్ చంద్రశేఖర్ లవ్ స్టోరీ

Fernadez

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కొద్ది రోజులుగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల్లో ఇరుక్కొని సినీ ఇండస్ట్రీకి దూరం అవుతుందా అనుకుంటున్న తరుణంలో ఆమె స్టోరీనే తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ కాంట్రవర్సీని సిరీస్ గా మార్చి సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇటీవల రియల్ లైఫ్ ఈవెంట్లపై వస్తున్న ఓటీటీ స్టోరీలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఇదే ట్రెండ్ లో సుఖేశ్ విత్ జాక్వెలిన్ లవ్ స్టోరీ కూడా రెడీ చేసేస్తున్నారట.

‘ఈ సబ్జెక్ట్ మంచి పర్ఫెక్ట్ ఫాడర్ కావడం ఖాయం. దీని కోసం ఇప్పటికే ప్రొడ్యూసర్లు సిద్ధమైపోయారు. ఇది సినిమాగా కానీ, వెబ్ షోగా కానీ తీయనున్నారు. సుఖేశ్.. జాక్వెలిన్ పాత్రల్లో ఎవరు కనిపించాలనే దానిపై డిస్కషన్స్ మొదలయ్యాయి కూడా. ఇటీవలి కాలంలో రాబోయే అతి పెద్ద ప్రొజెక్ట్ గా నిలుస్తుంది’ అని సినీ వర్గాలు అంటున్నాయి.

…………………………..: ట్రూలీ వరల్డ్ క్లాస్ బౌలర్‌ పేరు దక్కించుకున్న జహీర్ ఖాన్

నిజానికి సుఖేశ్ ఒక సూపర్ హీరో సినిమాను జాక్వెలిన్ లీడ్ రోల్స్ లో తీస్తానని ప్రామిస్ చేశాడట. ఏంజెలినా జోలీతో పోల్చి మూడు పార్టులుగా తెరకెక్కిస్తానని హామీ ఇచ్చాడట. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టెక్నిషియన్లతో వర్క్ చేయించి హై క్వాలిటీతో పనిచేయిస్తానంటూ నమ్మబలికాడట.

ఇదిలా ఉంటే తాను జాక్వెలిన్ సోదరికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చానని సుఖేశ్ చెప్తుంటే.. అటువంటిదేమీ లేదని జాక్వెలిన్ ఈడీ అధికారుల ముందు బుకాయిస్తోంది. సుఖేశ్ మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ పలు మార్లు ఈడీ విచారణ ఎదుర్కొంది.