Srikakulam YSP Politics : ఉత్తరాంధ్ర వైసీపీలో ఆధిపత్య పోరు? ధర్మాన తనయుడు అంత మాటన్నది బొత్సనేనా..!
Srikakulam YSP Politics : మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు లేటెస్ట్ కామెంట్స్ శ్రీకాకుళం జిల్లానే కాదు.. ఉత్తరాంధ్రలోనే హాట్ టాపిక్‌గా మారాయి.
- Harish Thanniru
- Published on- September 5, 2026 / 02:47 PM IST
Srikakulam YSP Politics
Srikakulam YSP Politics : పార్టీ పవర్‌లో లేదు. సీనియర్ లీడర్లు సైలెంట్‌గా ఉంటున్నారు. కూటమితో ఢీ అంటే ఢీ అనడంతో వెనకబడిపోతున్నామని వైసీపీ అధిష్టానం ఫీల్ అవుతుంటే.. కొందరు యువనేతలు చేస్తున్న కామెంట్స్ ఫ్యాన్ పార్టీని మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయట. అప్‌కమింగ్ లీడర్లు, సీనియర్ నేతల వారసులు చేస్తున్న హడావిడి ఆ జిల్లాల్లో ఆసక్తికరంగా మారిందట.
Also Read : Rock Dam : పాకిస్థాన్‌కు భారీషాక్.. లద్దాఖ్‌లో భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్.. దీని వల్ల ఉపయోగాలు ఏమిటంటే?
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు లేటెస్ట్ కామెంట్స్ శ్రీకాకుళం జిల్లానే కాదు.. ఉత్తరాంధ్రలోనే హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరి జుట్టు వారే దువ్వుకోవాలని.. పక్క జిల్లాల నేతల ప్రమేయం, పెత్తనం తమకు అక్కర్లేదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ధర్మాన రామ్ మనోహర్ నాయుడు అలియాస్ చిన్ని చేసిన ఈ కామెంట్స్ వైసీపీలోనే అగ్గి రాజేశాయి. చిన్ని బొత్స సత్యనారాయణను ఉద్దేశించే అలా మాట్లాడారని వైసీపీ క్యాడర్‌లో చర్చ జరిగింది.
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. బొత్స తన తండ్రి సమానులను చెప్పుకొచ్చారు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు కానీ.. లేక బొత్సను కాదు మరో నేతను ఉద్దేశించి మాట్లాడానని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రామ్‌మనోహర్‌నాయుడు వ్యాఖ్యలపై చర్చ జరుగుతూనే ఉంది.
రామ్‌మనోహర్ నాయుడు బొత్సనే టార్గెట్ చేశారని ఓ వర్గం చర్చించుకుంటుంది. అందుకు కారణాలు లేకపోలేదని అంటున్నారు. గతంలో శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పనిచేశారు బొత్స. శ్రీకాకుళం నుంచి వైసిపి ప్రారంభించిన అనేక యాత్రల్లో కీరోల్ ప్లేచేసేవారు. అప్పటి నుంచి సిక్కోలు జిల్లాలో బొత్స తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని.. వారిని ప్రోత్సహిస్తూ వచ్చారని.. ఏ సహాయం కావాలన్నా చేసిపెడుతూ వచ్చారని టాక్.
శ్రీకాకుళంలో బొత్సం వర్గం యాక్టివ్ రోల్ ప్లే చేస్తుందనే భావనలో ధర్మాన వర్గం ఉందనే చర్చ నడుస్తుంది. మరోవైపు జిల్లాలో తూర్పు కాపు వర్గానికి బొత్స పెద్దదిక్కుగా ఉన్నారట. తూర్పు కాపు నేతలకు అండగా ఉండటమే కాకుండా..ధర్మాన కుటుంబంపై విమర్శలు చేస్తున్న వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్‌కి బొత్స సపోర్ట్ చేస్తున్నారని తిరిగి పార్టీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధర్మాన వర్గం అసంతృప్తిగా ఉందట. అందుకే చిన్ని ఇలా మాట్లాడి ఉంటారనే చర్చ సాగుతుంది.
సీనియర్ నేతలైన బొత్స.. ధర్మాన ఎప్పుడూ జిల్లాలో కలిసే పనిచేస్తూ వచ్చారు. జిల్లా కార్యక్రమాల్లో కూడా ధర్మానకే ప్రాధాన్యమిచ్చేవారని.. ఇంచార్జ్ మంత్రిగా ఉన్నా.. ధర్మాన ప్రసాదరావునే కార్యక్రమాలు నడిపించమనేవారని సీనియర్ నేతలు చెప్తున్నారు. ఇద్దరూ రెండు జిల్లాల వారని వారిద్దరి మధ్య ఎప్పుడూ సయోధ్యనే ఉంటూ వస్తుందని అంటున్నారు. గతంలో ధర్మాన కూడా ఎక్కడో నుంచి కొందరు రెడ్లు వచ్చి జిల్లాపై ఆధిపత్యం చేయాలని చూస్తున్నారని.. వారి దోపిడీని అడ్డుకుంటామన్నారే తప్ప.. ఏనాడు బొత్సపై కామెంట్స్ చేయలేదని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.
కానీ, రామ్ మనోహర్ నాయుడు వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద చర్చనీయంశంగా మారాయి. దీంతో సిక్కోలు పాలిటిక్స్ తూర్పుకాపు వర్సెస్ వెలమగా మారాయన్న టాక్ వినిపిస్తోంది. రామ్ మనోహర్ నాయుడు మాత్రం బొత్స తనకు తండ్రి వంటివారని ఆయనపై తానేందుకు విమర్శలు చేస్తానని..తన మాటలు వక్రికరించారంటూ చెప్పుకోస్తున్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా..రామ్ మనోహర్ కామెంట్స్ మాత్రం సిక్కోలు పొలిటికల్ చౌరస్తాలో గుసగుసలకు దారితీస్తున్నాయి.
