MLA Madhusudan Reddy: చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా.. శివయ్య సాక్షిగా నేను చర్చకు సిద్దం..

కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయక ప్రజలకోసం కష్టపడ్డ వ్యక్తిని నేను. అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంట్లో దాక్కొని ఉన్నాడు.

Srikalahasti MLA Madhusudan Reddy

Srikalahasti MLA Madhusudan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో సభపెట్టి చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. బొజ్జల కుటుంబం నాకు పోటీ కాదు.. చంద్రబాబు, ఆయన కుమారుడు శ్రీకాళహస్తిలో నాపై పోటీకి రావాలి. ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా అని మధుసూదన్ రెడ్డి అన్నారు. జగన్ నిన్ను ఎలానూ కుప్పంలో గెలవనివ్వడు.. ఇక్కడకు పోటీకి రా.. తేల్చుకుందాం అంటూ  సవాల్ విసిరారు.

Chandrababu Naidu : అందుకే ఆనాడు వేంకటేశ్వరుడు నన్ను కాపాడాడు, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది, ఎవరినీ వదలిపెట్టను

స్వర్గీయ బొజ్జల గోపాలృష్ణారెడ్డి తనకు మంచి మిత్రుడు అనిచెప్పిన చంద్రబాబు.. మరి ఆయన్ను మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలి అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రశ్నించారు. నా కష్టంతో నాకు బొజ్జ పెరిగింది.. కానీ అవినీతి సంపాదన తిని మీ బొజ్జ పెరిగిందంటూ బొజ్జల సుధీర్ రెడ్డిపై విమర్శలు చేశారు. మీది సింగపూర్, ఎర్రచందనం, ఎర్రమట్టి, ఇసుక ఆరగించిన బొజ్జ పెరిగిందని మధుసూదన్ అన్నారు. వేరే నియోజకవర్గం నుంచి నిన్న చంద్రబాబు పర్యటనకు మనుషులను తరలించారని ఆరోపించారు.

Chandrababu : పులివెందుల గడ్డపై పులి కేకలు వేశా..నువ్వెంత?

కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయక ప్రజలకోసం కష్టపడ్డ వ్యక్తిని నేను. అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంట్లో దాక్కొని ఉన్నాడంటూ విమర్శించారు. వైఎస్ కుటుంబం గురించి కాకుండా తన సోదరుడు గురించి చంద్రబాబు చెప్పాలి. సొంత సోదరుడు కుమారుడు సినిమాల్లో ఎదగకుండా చూస్తున్నాడు. శ్రీకాళహస్తి అభివృద్ధిపై శివయ్య సాక్షిగా నేను చర్చకు సిద్దం. చంద్రబాబు చర్చకు రావాలని మధుసూదన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక, మట్టి అమ్మకాలు అంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మించకుండా అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు.