‘ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనడం అభ్యంతరకరం’…సీఎస్ లేఖకు స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

  • Publish Date - November 18, 2020 / 08:57 AM IST

Nimmagadda Ramesh respond cs letter : ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనడం అభ్యంతరకరమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. సీఎస్ కు ఎస్ఎంఎస్ ద్వారా నిమ్మగడ్డ రిప్లై ఇచ్చారు.



స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనడం రాజ్యంగ వ్యవస్థను కించపరచటమే అవుతుందన్నారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘించచడమేనని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.



ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కోవిడ్ తీవ్రత కొనసాగుతోందన్నారు. ప్రాజల ప్రాణాలు కాపాడటం అత్యంత ముఖ్యమైన అంశం అన్నారు.



https://10tv.in/the-state-election-commission-is-preparing-to-conduct-local-body-elections-in-andhra-pradesh/
ఇప్పటికే కోవిడ్ వల్ల రాష్ట్రంలో6,890 మంది చనిపోయారని తెలిపారు. కేంద్రం అనేక రాష్ట్రాలను హెచ్చరించింది. కేంద్ర మార్గాదర్శకాలకు లోబడి కోవిడ్ నియంత్రణా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పోలీసులు కూడా కోవిడ్ నియంత్రణలో భాగస్వాములయ్యారని తెలిపారు.



కోవిడ్ నియంత్రణలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవలంభిస్తుందన్నారు. ఏపీలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఇవాళ నిమ్మగడ్డ గవర్నర్‌ ను కలవనున్నారు.