Election Code‌ in AP : ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్ఈసీ నీలం సాహ్ని

పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్నీ అన్ని పార్టీలను కోరారు. ఆల్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని చెప్పారు.

Election Code‌ in AP  : పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఏపీ ఎస్‌ఈసీ నీలం సాహ్నీ అన్ని పార్టీలను కోరారు. ఆల్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్షన్‌పై పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు. పరిషత్ ఎన్నికలు ఆలస్యం కావడంతో జిల్లా, మండల స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు.

సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం ప్రతినిధులు హాజరయ్యారు. పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ నీలం సాహ్నికి విడివిడిగా తమ అభిప్రాయాలు చెప్పారు. మరోవైపు ఎస్‌ఈసీ తీరుకు నిరసనగా అఖిలపక్ష సమావేశాన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ బహిష్కరించాయి.

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం బాధ్యతలు తీసుకున్న రోజే…ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. అవసరమైన చోట్ల ఈనెల 09న రీపోలింగ్ నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు