×
Ad

Visakhapatnam : హత్య? ఆత్మహత్య? విశాఖలో సంచలనం రేపుతున్న వెస్ట్ బెంగాల్ విద్యార్థిని రితి సాహ కేసు.. అసలేం జరిగింది?

సీసీటీవీ ఫుటేజ్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాము. ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా మరిన్ని సెక్షన్లు యాడ్ చేస్తాము Visakhapatnam Student Case

  • Published On : August 24, 2023 / 05:35 PM IST

Riti Saha (Photo : Google)

Visakhapatnam Student Case : ఆకాశ్ విద్యార్దిని రితి సాహ కేసు విశాఖలో సంచలనంగా మారింది. రితి సాహ ఎలా చనిపోయింది? అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. కేసు వివరాలను సీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు.

”నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెస్ట్ బెంగాల్ కు చెందిన రితి సాహ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సాధన హాస్టల్ లో జూన్ 2022 నుంచి ఉంటోంది. నీట్ కు ప్రిపేర్ అవుతోంది. 14వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో భవనం పైనుంచి దూకి తీవ్రంగా గాయపడింది. హాస్టల్ సిబ్బంది అమ్మాయిని వెంకట రమణ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

Also Read..Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

15వ తేదీన హాస్పిటల్ డాక్టర్.. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అమ్మాయిని తల్లిదండ్రులు కేర్ హాస్పిటల్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16వ తేదీన మృతి చెందింది. సీసీటీవీ ఫుటేజ్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాము. అమ్మాయి తల్లిదండ్రులు ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు ఇద్దరు ఏసీపీలను నియమించాము. హత్య కోణంలో ఇంతవరకు ఆధారాలు లభించ లేదు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.

Also Read..Ananthapur : పోలీసులమని బెదిరించి రూ.2 కోట్లు దోచుకెళ్లిన హైవే దొంగలు, అనంతపురంలో ఘరానా మోసం

తల్లిదండ్రులు ఈ కేసుకు సంబంధించి కాలేజీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల అనుమానాలు, ఇతర కారణాలు అన్నీ సేకరించి విచారణ చేస్తున్నాము. ఎవరినీ కాపాడాల్సిన అవసరం మాకు లేదు. ఇంకా అనుమానాస్పద మృతి కిందనే కేసు నమోదు చేశాము. హత్య, ఆత్మహత్య అనేది ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా తెలిశాక.. మరిన్ని సెక్షన్లు జోడిస్తాము” అని సీపీ వెల్లడించారు.