Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

బిర్యానీ కోసం జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. Biryani Murder - Chennai

Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

Chennai Biryani Murder (Photo : Google)

Biryani Murder – Chennai : మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఎంతో ఈజీగా మర్డర్లు చేస్తున్నారు. మనుషుల్లో పట్టరాని కోపం, అసహనం పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మంచి నీళ్లు తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. మారణాయుధాలు వెంట పెట్టుకుని తిరుగుతూ ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా చెన్నైలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. బిర్యానీ కోసం జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాగుబోతుల చేతిలో హతమయ్యాడు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

చెన్నైలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. బాలాజీ(22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు మన్నూరుపేటకు వెళ్లాడు. షాపులో బిర్యానీ ఆర్డర్ చేశాడు. అదే సమయంలో కొందరు తాగుబోతులు అక్కడికి వచ్చారు. వారు కూడా బిర్యానీ ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో వారు బాలాజీతో గొడవపడ్డారు. అసలే ఫుల్లుగా తాగున్నారు. మద్యం మత్తులో వారు రెచ్చిపోయారు. బాలాజీపై దాడి చేశారు. వేటకొడవళ్లతో నరికి చంపారు.

Also Read..Uttar Pradesh: యూపీలో అమానవీయ ఉన్మాదం.. 5 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా చంపిన సాధువు

నడిరోడ్డుపై దారుణం జరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాహనదారులు తమకేమీ పట్టనట్లు సినిమా చూసినట్లు చూసుకుంటూ వెళ్లిపోయారు. ఒక్కరు కూడా అడ్డుకునే సాహసం చెయ్యలేకపోయారు. అసలే తాగుబోతులు, పైగా వేటకొడవలి చేతిలో ఉంది. దీంతో ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారు.

Also Read..Tirupati : తీవ్ర విషాదం.. అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య, పెళ్లి చేసుకుని ఆ తర్వాత

ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ”మృతుడి పేరు బాలాజీ. వయసు 22 సంవత్సరాలు. ముగ్గురు వ్యక్తులు అతడిని హత్య చేశారు. చెన్నై మన్నూర్ పేట్ బస్టాప్ దగ్గర ఈ ఘటన జరిగింది. బిర్యానీ ఆర్డర్ చేసే విషయంమై గొడవ జరిగింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలాజీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని శంకర్, అజిత్, వెంకట్ గా గుర్తించాము. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశాం” అని అంబత్తూర్ పోలీసులు తెలిపారు.