Summer Holidays : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవులపై సర్కార్ కీలక ప్రకటన .. ఈ నియమాలు పాటించాలి..
Summer Holidays 2026 : విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వేసవి సెలవులుపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- April 22, 2026 / 12:17 PM IST
Summer Holidays 2026 for Schools in AP
- వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
- 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
- జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం
AP Summer Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం వేసవి సెలవులుపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపింది. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. ఇదిలాఉంటే.. ఏప్రిల్ 24 నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా వేసవి సెలవులు ఇస్తారు. అయితే, జూన్ 1వ తేదీ నుంచే వీరికి కొత్త విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభమవుతుంది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ తరగతులు రాష్ట్రవ్యాప్తంగా మొదలవుతాయి.
Also Read : 2029 నాటికి ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్.!?
వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరం చివరి రోజులోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు పెద్దల పర్యవేక్షణ లేకుండా వెళ్లొద్దని విద్యార్థులకు సూచించాలని, అదే సమయంలో మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని విద్యాశాఖ పేర్కొంది. అంతేకాక.. పాఠశాల్లోని నోటీసు బోర్డులపై వేసవిలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులకు సైతం సూచనలు చెప్పి, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని పేర్కొంది.
తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు:
- సెలవుల్లో పిల్లలను సముద్రం, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వవద్దు.
- ఈసారి ఎండలు తీవ్రంగా ఉండటంతో.. బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలి. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి.
- సెలవుల్లో విద్యార్థులు ఒంటరితనానికి గురికాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడం, కలిసి భోజనం చేసేలా చూడాలి.
- సెలవుల్లో విద్యార్థులు.. టీవీలు, సెల్‌ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా తల్లిదండ్రులు వారిని నియంత్రించాలని సూచించారు.
