AP SSC Students : ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు మే1 నుంచి 31 వరకు వేసవి సెలవులు

ఏపీలో టెన్త్‌ క్లాస్‌ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి మే 31వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు

Summer holidays for AP SSC students : ఏపీలో టెన్త్‌ క్లాస్‌ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి మే 31వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 7వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు యాథాతధంగా సాగుతాయని అన్నారు.

మరోవైపు ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 74 వేల 041 శాంపిల్స్ పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 4 వేల 431 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,60,68,648 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.

చిత్తూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విశాఖపట్టణంలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు