Chandrababu : చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని రామకృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.

Chandrababu (6)

Chandrababu Cash for Vote Case : టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా కోరారు. కాగా, ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. “మనోళ్లు బ్రీఫ్డ్ మీ” వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే ఫోరెన్సిక్ నిర్ధారించింది. ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని రామకృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.

Also Read : విశాఖ జిల్లాలో గ్యాస్ సిలిండర్ లీక్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కానీ, చంద్రబాబును నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని రామకృష్ణారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు తదుపరి విచారణ సుప్రీంకోర్టు జనవరి రెండోవారానికి వాయిదా వేసింది.

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
రాజధాని అమరావతి ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపింపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్‍ ప్లాన్‍లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 1కి వాయిదా వేసింది.

Also Read : నారా లోకేష్ యువగళం పాదయాత్ర 212వ రోజు ప్రారంభం

మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ ల పై బుధవారం వాదనలు కొనసాగాయి. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ డిసెంబర్ 11 కు వాయిదా పడింది.

ట్రెండింగ్ వార్తలు