Nara Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర 212వ రోజు ప్రారంభం

ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో లోకేష్ భేటీ కానున్నారు.

Nara Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర 212వ రోజు ప్రారంభం

Nara Lokesh (8)

Updated On : November 29, 2023 / 11:23 AM IST

Nara Lokesh Yuvagalam padayatra : టీడీపీ అధినేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 212 రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగనుంది. ముమ్మడివరం కొండమ్మ చింత సెంటర్ లో డ్వాక్రామహిళలతో లోకేష్ భేటీ కానున్నారు.

ముమ్మడివరం ఎన్టీఆర్, బాలయోగి విగ్రహాల వద్ద గౌడలతో లోకేష్ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ముమ్మడివరం సెంటర్ లో బహిరంగసభ లో లోకేష్ ప్రసంగించనున్నారు. ముమ్ముడివరం పల్లెపాలెం సెంటర్ లో దళితులతో లోకేష్ సమావేశం కానున్నారు.

Michaung Cyclone : బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో తుపాన్ ముప్పు…ఐఎండీ హెచ్చరిక

కొమనాపల్లి సెంటర్ లో స్థానికులతో లోకేష్ సమావేశం అవుతారు. అన్నంపల్లి సెంటర్ లో ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. మురమళ్ల సెంటర్ లో బుడగ జంగాలతో సమావేశం కానున్నారు. మురమళ్లలో భోజన విరామం తీసుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు తిరిగి మురమళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

కొమరగిరిలో స్థానికులతో లోకేష్ సమావేశం కానున్నారు. ఎదుర్లంక సెంటర్ లో స్థానికులతో సమావేశమవుతారు. పాత ఇంజరం వద్ద పాదయాత్ర 2900 కిలో మీటర్లకు చేరనుంది. ఈ సందర్భంగా లోకేష్ శిలాఫలకం ఆవిష్కరణ చేయనున్నారు. రాత్రి 9గంటల సుంకరపాలెం వద్ద లోకేష్ బస చేయనున్నారు.