బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో తుపాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక

బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది.....

బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో తుపాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక

Cyclonic storm

Michaung Cyclone : బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో మైచాంగ్ తుపాన్ ఏర్పడే అవకాశముందని భారతవాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలోని అల్పపీడన ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. నవంబర్ 29వ తేదీ బుధవారం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ అండ్ నికోబార్ దీవుల మీదుగా గంటకు 25 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతుందని, నవంబర్ 30వతేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. నికోబార్ దీవులలో నవంబర్ 29, డిసెంబరు 1వ తేదీల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అండమాన్ దీవులలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

డిసెంబర్ 1వ తేదీన గంటకు 50-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. డిసెంబర్ 1వతేదీ ఉదయం నుంచి నైరుతి బంగాళాఖాతంలో గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 2వతేదీ ఉదయం గాలుల వేగం గంటకు 60-80 కిలోమీటర్ల వేగం వరకు పెరుగుతుంది. నవంబర్ 29, 30 తేదీల్లో మత్స్యకారులు దక్షిణ అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ అధికారులు కోరారు.

ALSO READ : Indian Students : భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో వీసాలు…యూఎస్ ఎన్ని వీసాలు జారీ చేసిందంటే…

నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వతేదీ వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు తీరప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది. బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల కలెక్టర్‌లకు రాసిన లేఖలో ప్రత్యేక సహాయ కమిషనర్ సత్యబ్రత సాహూ అలర్ట్ చేశారు.

ALSO READ : Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. బరిలో 2,290 మంది అభ్యర్ధులు

దక్షిణ అండమాన్ సముద్రం మీద ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని సత్యబ్రత సాహూ తెలిపారు. నవంబర్ 29-30 వతేదీల మధ్యకాలంలో జమ్మూ-కశ్మీర్-లడఖ్-గిల్గిత్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్ మీదుగా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 30వతేదీన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాలు కురవచ్చు.

ALSO READ : Money Seized : పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కలకలం.. భారీగా పట్టుబడిన నగదు

రానున్న రెండు రోజుల్లో పశ్చిమ మధ్యప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వరకు అక్కడక్కడా విస్తృతమైన వర్షపాతం, ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా.తూర్పు మధ్యప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే 24 గంటల్లో విదర్భలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ బుధవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది.