Skill Development case : చంద్రబాబు క్వాష్ పిటిషన్.. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు.. సీజేఐకు బదిలీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాల వ్యక్తమయ్యాయి.

Chandrababu Quash Petition

Supreme Court : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాల వ్యక్తమయ్యాయి. పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తమ తీర్పును వెల్లడించింది. సెక్షన్ 17ఏ అంశంపై ఇద్దరు జడ్జీలు తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని జస్టిస్ బోస్ తన తీర్పులో వెల్లడించగా.. వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో వెల్లడించారు. ఇద్దరి న్యాయమూర్తుల మధ్య సెక్షన్ 17 ఏ విషయంలో భిన్నాభిప్రాయాల కారణంగా తుది నిర్ణయంకోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Also Read : Chandrababu Quash Petition : ఏం జరగనుంది? సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై జస్టిస్ త్రివేది తన తీర్పులోకీలక విషయాలు ప్రస్తావించారు.. చంద్రబాబుకు 17ఏ వర్తించదని స్పష్టం చేశారు. 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని తీర్పులో పేర్కొన్నారు. 2018కి ముందు జరిగిన నేరాలకు దీన్ని వర్తింపజేస్తే ఈ 17ఏ ఉద్దేశమే పరిహాసమవుతుందని అన్నారు. నిజాయితీ పరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామని పార్లమెంట్ డిబేట్ సారాంశం అని జస్టిస్ బేలా త్రివేది అన్నారు.
జస్టిస్ బోస్ తన తీర్పులో.. గవర్నర్ అనుమతి తీసుకొని కేసు కొనసాగించవచ్చని తీర్పులో పేర్కొన్నారు. చంద్రబాబును రిమాండ్ కు పంపుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

Also Read : సెక్షన్‌ 17ఏ అంటే ఏమిటి.. ఈ సెక్షన్‌ ఎవరెవరికి వర్తిస్తుంది?

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు రావడంతో.. ఈ కేసులో విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. సీజేఐ ముందుకు చంద్రబాబు స్కిల్ డవలప్ మెంట్ కేసు వెళ్లబోతుంది.. సెక్షన్17 ఏ వర్తిస్తుందా? వర్తించదా? అనేది తదుపరి సీజేఐ బెంచ్ నిర్ణయించడం.. లేకుంటే తనకున్న అధికారాల ద్వారా మరొక త్రిసభ్య ధర్మాసనం, విస్తృతస్థాయి ధర్మాసనం ఏర్పాటు చేసి ఆ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపే అవకాశం ఉంది. రాజ్యాంగ ధర్మాసనంకు ఈ కేసు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పట్లో అదిసాధ్యమవుతుందా? ఈ కేసు విచారణ వెనువెంటనే జరుగుతుందా అనేది కూడా వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికే న్యాయవాది ప్రశాంత భూషణ్ సెక్షన్ 17ఏ ను రద్దు చేయాలని వేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో పెడింగ్ లో ఉంది.. ఆ కేసుకు, ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డవలప్ మెంట్ కేసుకు ట్యాగ్ చేస్తారా అనేదికూడా వేచిచూడాల్సి ఉంది.