Supreme Court
AP Government : అమరావతి రాజధానిపై దాఖలైన పటిషన్లపై విచారణ ఈ ఏడాది డిసెంబర్‌కు వాయిదా పడింది. ఆలోపు ఈ కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. త్వరగా విచారణకు సాధ్యం కాదని, డిసెంబర్‌లో పూర్తిస్థాయి విచారణ చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పేర్కొంది. ఆగష్టు నుంచి నవంబర్ వరకు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
R5 Zone Case : అమరావతి ఆర్5 జోన్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రతివాదుల్లో చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించినట్లయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్లేనని వెల్లడించింది. అయితే, కొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతులు కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.