Raghu Raju: ఎమ్మెల్సీ ర‌ఘురాజుపై ఏపీ శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ వేటు

వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో విచార‌ణ జ‌రిపి మండలి ఛైర్మన్ నిర్ణ‌యం తీసుకున్నారు.

Raghu Raju

శృంగవరపుకోటకు చెందిన ఎమ్మెల్సీ ర‌ఘురాజుపై ఆంధ్రప్రదేశ్ శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ మోషేన్ రాజు వేటు వేశారు. పార్టీ ఫిరాయింపు కింద ర‌ఘురాజుపై వేటు పడింది. రఘురాజు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో విచార‌ణ జ‌రిపి మండలి ఛైర్మన్ నిర్ణ‌యం తీసుకున్నారు.

కాగా, రఘురాజుపై చర్యలు తీసుకోవాలంటూ మండలిలో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మండలి ఛైర్మన్ విచారణ జరిపారు. వివరణ ఇవ్వాలని రఘురాజుకు పలుసార్లు చెప్పారు. అందుకు ఆయన వెళ్లలేదు. దీంతో ఇవాళ రఘురాజుపై సస్పెన్షన్ వేటు పడింది.

ఈ ఏడాది మార్చి 14న రఘురాజు భార్య సుధారాణి నేతృత్వంలో పలువురు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరారు. వారంతా అప్పట్లో టీడీపీ నేత నారా లోకేశ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారిలో 15 మంది సర్పంచులతో పాటు 17 మంది ఎంపీటీసీలు కూడా ఉన్నారు.

Also Read: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్..