Artist Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమ అరెస్ట్.. కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
తాజాగా బెంగళూరు పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నారు.

Benguluru Police Arrested Artist Hema
Artist Hema : ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు ఏపీకి చెందిన వారు ఉన్నారని వార్తలు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పోలీసులు అధికారికంగా ప్రకటించినా హేమ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అందులో హేమ డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బెంగుళూరు పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.
అయితే నటి హేమ బెంగురు పోలీసులు వద్దకు విచారణకు హాజరవలేదు. తాజాగా బెంగళూరు సిసిబి పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపర్చుతారు.
కాగా, మొదటి సారి ఇచ్చిన నోటీసులకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేను అని లేఖ పంపింది హేమ. రెండవ సారి నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైంది. ప్రస్తుతం హేమను పోలీసులు విచారిస్తున్నారు.