Swarupa Nandendra Sarswati Swamy
Simhachalam: విశాఖపట్టణంలోని సింహాచలం కొండపై జరుగుతున్న అప్పన్న చందనోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.ఈ చందనోత్సవంలో శారద పీఠం శ్రీశ్రీ స్వరూప నదేంద్ర సరస్వతి పాల్గొని నిజరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లపై స్వరూప నదేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సరిగాలేవని, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈరోజు దర్శనం ఎందుకు చేసుకున్నానా అని అనిపిస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దేవాలయం ప్రతిష్ట మంటగలిపారని అన్నారు. సింహాచలం పేదల దేవుడు పెద్దల దేవుడు కాదు. కానీ, ఇక్కడ పెద్దలు మాత్రమే ఉన్నారు. సామన్య భక్తులు లేరు. సాధరణ భక్తుల కేకలు వింటుంటే ఎడుపు వస్తుందంటూ స్వరూప నరేంద్ర స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
సింహాచలం చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. అత్యంత దారుణమైన తీరు అధికారులు కనబరిచారంటూ మండిపడ్డారు. అంతరాలయంలో ప్రతిష్ట దిగాజార్చరు. భక్తుల యొక్క అర్తనాదాలు అధికారులకు తగులుతాయి అంటూ స్వరూపా నదేంద్ర సరస్వతి తీవ్రస్థాయిలో ఆలయంలో ఏర్పాట్లను ఉద్దేశించి అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే చందనోత్సవంలో ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రులు కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణలను ఆలయంలో ఏర్పాట్లపై నిలదీశారు. ఏర్పాట్లు చెయ్యడంలో విఫలం అయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు భక్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. పోలీసుల తీరుపై దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిజరూప దర్శనం, చందనోత్సవంలో వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఆయన కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. అనువంశధర్మకర్త అశోక్ గజపతిరాజు మొదట పూజ నిర్వహించారు. సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామికి డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ, జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.