Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన 20 కుటుంబాల ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారి వివరాలను అధికారులకు సమాచారం అందించారు.

Tadepalligudem pilgrims : జమ్మూకశ్మీర్ లోని అమర్ నాథ్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతయ్యారు. తాడేపల్లిగూడెం నుంచి 20 కుటుంబాలు అమర్ నాథ్ యాత్రకు వెళ్లాయి. గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువుల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన వారిలో టీడీపీ నేతలు, తాడేపల్లిగూడెం పాలకేంద్రం మేనేజర్ ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు కుటుంబీకులు సమాచారం అందించారు.

అమర్‌నాథ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. నిన్న వరదల్లో 40మందికి పైగా గల్లంతు కావడంతో.. వారి జాడ కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ఆరు టీమ్‌లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాల కింద మృతదేహాలు కూరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బురద నుంచి మృతదేహాల్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారి కోసం 8 హెలికాప్టర్లతో గాలిస్తున్నారు.

Amarnath Yatra: అమర్‌నాథ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 1500 మందిని..

అమర్‌నాథ్‌ జల విలయంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటిదాకా 16మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గల్లంతయ్యారు. ఇంకో 65మంది గాయపడ్డారు. వారిని ఎయిర్‌ఫోర్స్‌ విమానాల్లో ఆస్పత్రికి తరలించారు. నిన్న చనిపోయిన 16మంది మృతదేహాల్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని హెలికాప్టర్లలో శ్రీనగర్‌కు తరలించారు. అక్కడ్నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన 20 కుటుంబాల ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారి వివరాలను అధికారులకు సమాచారం అందించారు. అటు అమర్‌నాథ్‌ జలవిలయంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన 150 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.

MLA Raja Singh : అమర్నాథ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

వరదల్లో గల్లంతైనవారి ఆచూకీ పూర్తిగా లభించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా పోటెత్తిన వరదలతో అమర్‌నాథ్‌ గుహ వద్ద వేలాదిమంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు దాదాపు 15వేల మంది యాత్రికుల్ని అక్కడ్నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ట్రెండింగ్ వార్తలు