Amarnath Yatra: అమర్‌నాథ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 1500 మందిని..

వరదల్లో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను రక్షించేందుకు భారత ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. శనివారం సాయంత్రం వరకు 1500 మందికిపైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు ఆర్మీ సిబ్బంది తరలించారు.

Amarnath Yatra: అమర్‌నాథ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 1500 మందిని..

Amarnath Flood

Amarnath Yatra: వరదల్లో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను రక్షించేందుకు భారత ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. దీనికోసం కశ్మీర్‌ లోయలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంది. అకస్మాత్తుగా మొదలైన వరదల కారణంగా ఇప్పటి వరకు 16మంది యాత్రికులు చనిపోగా, 40మందికిపైగా గల్లంతయ్యారు. సహాయక చర్యల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఐటిబిపి బృందాలు పాల్గొన్నాయి. ఎనిమిది హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయాన్ని అంచనా వేయడం కష్టమని లెఫ్టినెంట్ కల్నల్ సచిన్ శర్మ తెలిపారు.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతు

వరదల్లో చిక్కుకున్న యాత్రికులను రక్షించేందుకు ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తోంది. శనివారం సాయంత్రం వరకు 15,000 మంది యాత్రికులను పంజ్‌తర్ని దిగువ బేస్ క్యాంపుకు తరలించారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నామని ఆర్మీ సీనియర్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలన సహాయక చర్యల కోసం అధునాతన తేలికపాటి హెలికాప్టర్లను కూడా మోహరించింది. ఇదిలాఉంటే చికిత్స తర్వాత శనివారం 35 మంది యాత్రికులు డిశ్చార్జ్ చేయగా, మరో 17 మంది ఇంకా ఆసుపత్రుల్లో ఉన్నారని, ఈ రాత్రికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆలయ బోర్డు అధికారులు తెలిపారు.

Etela Rajender: ఈసారి గజ్వేల్ నుంచి ఈటల పోటీ? మీడియా చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు

దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ గుహ మందిరానికి సమీపంలో అత్యంత దుర్బలమైన ప్రాంతంలో గుడారాలు, కమ్యూనిటీ కిచెన్‌లు ఎలా ఏర్పాటు చేశారో తెలుసుకోవడానికి ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శనివారం అన్నారు. శుక్రవారం ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని మేము ఆశిస్తున్నామని తెలిపారు. గుడారాల ఏర్పాటు, తదితర రక్షణ చర్యలు ఇంతకుముందు అక్కడ జరిగాయని నేను అనుకోను. పంజ్‌తర్ని దీనికి చక్కని ప్రాంతం. ప్రస్తుతం జరిగిన ఘటన మానవ తప్పిదమే కావచ్చు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని అబ్దుల్లా అన్నారు.