Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు 20 కుటుంబాల వారు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతు

Amarnath Yatra

Amarnath Yatra: జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. వరదల్లో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను (Amarnath Floods) రక్షించేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అకస్మాత్తుగా మొదలైన వరదల కారణంగా 16మంది యాత్రికులు చనిపోగా.. 40 మంది గల్లంతయ్యారు. దీంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు భారత ఆర్మీతో సహా స్థానిక పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు.

Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు 20 కుటుంబాల వారు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. తాడేపల్లిగూడెం పాలకేంద్రంలో మేనేజర్ గా పనిచేసే వ్యక్తి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకుపోయారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ పూర్వ‌అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. అదేవిధంగా ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసి సిటీకేబుల్‌లో పనిచేసే జర్నలిస్టు అల్లూరి రామరాజు, ఆయన సతీమణి భవాని దంపతులు ఆచూకీ లేదు.

Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత

బడుగు పెద్దరత్త బంధువులు ఈ యాత్రకు వెళ్లి వదరల్లో చిక్కుకుపోయారు. బడుగు పెద్ద సొంత అక్క అయిన మారేడు వెంకట్రావమ్మ ఆమె భర్త రాజశేఖర్ గల్లంతయ్యారు. బడుగు పెద్ద అక్కబావ ఉపాధ్యాయులగా పనిచేసి పదవి విరమణ చేశారు. వారి ఆచూకీకోసం బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడుగు పెద్ద చెల్లెలు కొండేటి రాధ కూడా గల్లంతయిన వారిలో ఉన్నారు. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు సమాచార అందిస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే ఏపీ నుంచి అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రత్యేక విభాగం ద్వారా అక్కడ గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.