Ketireddy Peddareddy : 2024లో జేసీ కుటుంబానికి రాజకీయ సమాధి కట్టి చూపిస్తా : కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం జిల్లాలో రాజకీయాలు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయాయి. జేసీ,కేతిరెడ్డి విమర్శలు,ప్రతి విమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్ హీటెక్కాయి.

Ketireddy Peddareddy ..JC Prabhakar Reddy

Tadipatri YCP MLA Ketireddy Peddareddy : అనంతపురం జిల్లాలో రాజకీయాలు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై విమర్శలు చేశారు. వాటిపై స్పందించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జేసీకి కౌంటర్ ఇస్తు తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ మండిపడ్డారు. ఇలా జేసీ వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీ అన్నట్లుగా విమర్శలు,ప్రతి విమర్శలతో తాడిపత్రి పాలిటిక్స్ హీటెక్కాయి.

ఈక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు..2024 లో జేసీ కుటుంబానికి రాజకీయ సమాది కట్టి చూపిస్తా అంటూ సమాధానమిచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సైకో అంటూ మండిపడ్డారు. అందరు రైతులకు భీమా వచ్చింది,వారితోపాటే నాకూ వచ్చింది..నాకు లబ్ది చేకూరిందని జేసి బాధపడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. జేసీకి వ్యవసాయం తెలియదు కాబట్టే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. జేసీ నామీద కాకుండా… టీడీపీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలపై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ సూచించారు.

JC Prabhakar Reddy : ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

నేను నిజాయితీగా వ్యవసాయం, వ్యాపారం చేసి సంపాదించా నని అన్నారు. నా ఉనికి కోల్పోతుంది అంటే… నేను ఎంత దూరం అయినా వెళతానంటూ సమాధానమిచ్చారు. 2024లో ఎన్నికలు అయ్యాక నేను పాడె ఎక్కుతానో… నువ్వు పాడె ఎక్కుతావో చూస్తానంటూ జేసీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ టిక్కెట్ కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకోవడం కాదు… జగన్ కాళ్ళు పట్టుకుని చేసిన తప్పులకు క్షమాపణ కోరితే… నేనే దగ్గర ఉండి జేసీ కొడుకుకి వైసీపీ టిక్కెట్ ఇప్పించి గెలిపిస్తానని అన్నారు. మా అన్న హత్య కేసులో మేము రాజీ పడలేదని.. అప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నారు సాక్షాలను అధారాలు లేకుండా చేశారు కేసు నిలబదని మేము వదిలేశామని అన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

 

ట్రెండింగ్ వార్తలు