JC Prabhakar Reddy : ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

మాకు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే నా కుమారుడు ఓడిపోయారు. కానీ మీలా మేం జీవించటంలేదు. నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు ఆ విషయం మర్చిపోయారా?.మీ క్త్రెం నెంబర్ లతో సహా చెబుతా.

JC Prabhakar Reddy : ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Diwakar Reddy MLA Kethireddy Venkataramireddy

Updated On : July 10, 2023 / 12:49 PM IST

JC Prabhakar Reddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై విరుచుకుపడ్డారు.  నేను ఏ రోజు కేతిరెడ్డి గురించి మాట్లాడలేదు..కానీ అతనే తాడిపత్రికి వచ్చి నాపై ఇష్టానుసారం మాట్లాడారు..అందుకే నేను మాట్లాడాల్సి వస్తోంది అన్నారు. నన్ను చెప్పుతో కొడుతా అన్నారు ముసలివాడు, కుంటివాడు అని అంటున్నారు.. అది నిజమే కానీ నాలాగా మీరు పని చేయగలరా..? అంటూ ప్రశ్నించారు.

మీరు నా కుమారుల గురించి మాట్లాడుతున్నారు.. వారు ఎక్కడైనా బతకగలరు..మాకు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే నా కుమారుడు ఓడిపోయారు. కానీ మీలా మేం జీవించటంలేదు. మీదంతా నేరాల జీవితం. మేమలా జీవించటలేదు అంటూ చెప్పుకొచ్చారు. నాటు సారా అమ్ముతూ పట్టుబడ్డారు ఆ విషయం మర్చిపోయారా?.మీ క్త్రెం నెంబర్ లతో సహా చెబుతానంటూ విమర్శించారు జేసీ.

మీ అఫిడివిట్ లోనే 39 కేసులు ఉన్నట్లు చెప్పారు..ఇదీ నిజం కాదా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న తాడిపత్రి మున్సిపాలిటీని గెలుచుకోలేకపోయారు అంటూ ఎద్దేవా చేశారు. తాడిపత్రి వచ్చి మీరు నన్ను తిట్టారు. కానీ నేను ధర్మవరంకు వస్తే ఎవరూ నన్ను తిట్టరు కొట్టరు కానీ నిన్నే జనాల్ని కొట్టే రోజులు దగ్గర పడ్డాయి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించిన జేసీ..త్వరలోనే నాపై ఉన్న కేసులన్నీ త్వరలోనే కొట్టేస్తారని అన్నారు. మరి ముందు మీపై ఉన్న కేసుల గురించి సమాధానం చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు.