నన్ను చూసేందుకు ఎవరూ ఇక్కడకు రావద్దు: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, దేవుని దయవల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డానని అన్నారు.

JC Prabhakar Reddy

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జయి ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా అనంతపురంలోని తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, దేవుని దయవల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డానని అన్నారు. ఎందుకంటే ఇటీవల పరిస్థితి చాలా సీరియస్ అయిందని చెప్పారు.

తనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఇక్కడకు రావద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున ఎవరితోనూ కలిసి మాట్లాడేందుకు కుదరదని స్పష్టం చేశారు. తన పట్ల మీ ప్రేమ ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డికి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందింది. ఆ సమయంలోనూ.. చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు ఎవరూ రావద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే.

Also Read: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. కొత్త రేషన్ కార్డుల కోసం కమిటీ

ట్రెండింగ్ వార్తలు