Tadipatri Political War: తాడిపత్రి రాజకీయ మంటలు ఆరేదెప్పుడు? ఎలా? సినిమా డైలాగులను మించి ఆ ఇద్దరి కామెంట్స్

ఆ ఇద్దరు లీడర్ల పంతం, పౌరుషం ఇంచు కూడా తగ్గడం లేదు. పవర్‌లో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..పౌరుషం కోసం..పట్టు కోసం..పైచేయి సాధించుకోవడం కోసం న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతున్నారు.

Tadipatri Political War

Tadipatri Political War: నువ్వు తాడిపత్రికి రావాలంటే మగతనం ఉండాలి. కోర్టు పర్మిషన్ కాదు. పోలీసులు, గూండాలను పెట్టుకుని కాదు దమ్ముంటే ఎదురురా..తాడోపేడో తేల్చకుందాం. ఇది ఏ సినిమా డైలాగ్ కాదు. తాడిపత్రి రాజకీయ మంటల్లో రంకెళేస్తున్న మాటలు. ఎవ్వరు తగ్గరు. నెగ్గామన్న మాట కోసమే ఎంత దూరమైన వెళ్తారు. కోర్టులో పోరాటం చేసి పర్మిషన్‌ తెచ్చుకుని తాడిపత్రిలో అడుగుపెట్టేందుకు గజిని మహ్మద్ దండయాత్రలాగే నడుస్తోంది కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం.

కానీ తాడిపత్రికి ఎంట్రీ ఇవ్వగానే పోలీసులు అడ్డుకుంటారు. లేకపోతే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులే సీన్‌లోకి ఎంట్రీ ఇస్తారు. పోలీసులు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అంటారు. ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పొలిమేర అవుతలికి తీసుకెళ్లి వదిలిపెడుతారు. ఇది ఇప్పుడే కాదు..రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది. నా నియోజకవర్గం.. నా అడ్డా వచ్చి తీరుతానని పెద్దారెడ్డి..నిన్ను తాడిపత్రికి అడుగుపెట్టనిచ్చేది లేదంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మీసాలు మెలేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి మంటలు ఎంతకు ఆరడం లేదు. ఎవరూ ఆర్పే ప్రయత్నం చేయడం లేదు.

కోర్టు ఆదేశాలు, పోలీసుల అడ్డంకులు

వాళ్ల తండ్రులు, తాతల కాలంలో కత్తులతో దాడి చేసుకుంటే..ఇప్పుడు మాటలు, డైలాగ్‌ వార్‌తో రచ్చ రాజేస్తున్నారు. అప్పట్లోకి నీ ఇంటికొస్తా..నీ నట్టింటికొస్తా..నీ ఇంట్లోనే కూర్చుంటా అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇప్పుడు జేసీ కేతిరెడ్డి ఇంటికి వెళ్లకపోయి..పెద్దారెడ్డిని ఆయన సొంతింటికి కూడా వెళ్లనివ్వకుండా పంతం నెగ్గించుకుంటున్నారు. ఈ గట్టున జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆ గట్టున కేతిరెడ్డి పెద్దారెడ్డి..మధ్యలో పోలీసులు…పైనుంచి కోర్టు ఆదేశాలు..అయినా ప్రాబ్లమ్ సాల్వ్‌ కాదు.

పంచాయితీ తెగదు. ఎవరూ ఊరుకోరు. ఎంతకూ తగ్గరు. రాజకీయం మా బ్లడ్‌లోనే ఉంది..పౌరుషం వైఫ్‌ లాగా ఎప్పుడూ మా చుట్టే తిరుగుతోందని ఎంతకైతే గంతకాయే అంటున్నారు. ఒకరి పేరు తీస్తే మరో నేత అగ్గి మీద గుగ్గిల చల్లినట్లే రపరపమంటూ మండిపోతున్నారు. నువ్వు భయపడితే భయపడటానికి నేను నీ ఓటర్‌ని అనుకున్నావా..ప్రత్యర్థిని అంటూ బాలకృష్ణ డైలాగులు పేలుస్తున్నారు.

చరిత్ర గురించి మాట్లాడొద్దు..లెక్కకు లెక్కఅప్పజెప్పామన్నదే ముచ్చట అంటూ గర్జిస్తున్నారు. ప్రభుత్వాలు మారితే లీడర్ల పొజిషన్స్ మారుతాయి. అపోజిషన్‌లో ఉన్న నేత పవర్‌లోకి వస్తారు. పవర్‌లో ఉన్న నేత ప్రతిపక్షంలో ఉంటారు. కానీ జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి ఫైట్ చూస్తుంటే..అధికారం కంటే పౌరుషం, ప్రతీకారమే ఇంపార్టెంట్ అన్నట్లు కనిపిస్తోంది సీన్.

ఐదేళ్ల పాటు వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా హవా నడిపించిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి గత పదిహేను నెలలుగా తాడిపత్రిలోకి అడుగు పెట్టే ఛాన్సే లేకుండా పోయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన రాకను తీవ్రంగా అడ్డుకుంటున్నారు. రెండు మూడు సార్లు తాడిపత్రికి పెద్దా రెడ్డి వచ్చిన ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయారు. తన సొంత నియోజకవర్గం సొంత ఊరికి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని హైకోర్టుకెళ్లిన పెద్దారెడ్డికి ఊరట దక్కింది.

2 కార్యక్రమాలు.. ఇద్దరు ప్రత్యర్థులు ఒకే సమయం ఒకే ప్రాంతంలో… 

పోలీసు ప్రొటెక్షన్‌తో కేతిరెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీతో పెద్దిరెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు బ్రేకులు వేశారు. సరిగ్గా కేతిరెడ్డి తాడిపత్రి పర్యటన రోజే శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. రెండు కార్యక్రమాలు ఇద్దరు ప్రత్యర్ధులు ఒకే సమయం ఒకే ప్రాంతంలో సీన్‌ కనిపించడంతో పోలీసులు కేతిరెడ్డిని అడ్డుకున్నారు.

ఈ ఇద్దరికి ఆరు పదుల వయసు దాటింది. అయినా వారిలో సీమ పౌరుషం మాత్రం తగ్గడం లేదు. తాతల కాలం నాటి నుంచి ఉన్న వైరం..ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా..వయసుతో సంబంధం లేకుండా..శరీరం సహకరిస్తున్నా లేకున్నా..తాడిపత్రి మే సవాల్ అంటున్నారు. అధికారం, అపోజిషన్. రోల్ మారుతుంది.

అపోజిషన్‌లో ఉన్నా..పౌరుషం కోసం..పట్టు కోసం..

కానీ ఆ ఇద్దరు లీడర్ల పంతం, పౌరుషం ఇంచు కూడా తగ్గడం లేదు. పవర్‌లో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..పౌరుషం కోసం..పట్టు కోసం..పైచేయి సాధించుకోవడం కోసం న్యూస్‌ హెడ్‌లైన్‌గా మారుతున్నారు. కొడుకులు, మనమళ్లు, మనవరాళ్లు..ఇలా తరం మారిన..వాళ్ల తీరు మాత్రం మారట్లేదు. ఫ్యాంక్షన్‌ రాజకీయాలకు చోటే లేదంటూ..మాటలతోనే కత్తులు దూసుకుంటున్నారు వీళ్లిద్దరు.

అయితే ఈ ఇద్దరి పంచాయితీ చూసిన జనాలు.. మీరు మారరా. ఇంకెన్నాళ్లు ఈ పంతాలు, పట్టింపులు. అప్పుడు జేసీని ఓడించి కేతిరెడ్డి గెలిచారు. మొన్నటి కేతిరెడ్డిపై జేసీ వర్గం విజయం సాధించింది. ఇంకేం కావాలి. అసలేంటిది ఎవరు తగ్గరు. ఎంత చెప్పినా వినరు. తమ మాట నెగ్గాలన్నదే పట్టు. పౌరుషం కోసం..రోజూ ఈ గొడవేంటని అని గుసగుసలు పెట్టుకుంటున్నారట. అయితే ఈ ఇద్దరి లొల్లి ఈనాటిది కాదు. వాళ్ల తాతల కాలం నుంచే రాజకీయ వైరం ఉంది.

అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల నేతలు ఎదురెదురు పడరు. పడ్డా మాట్లాడుకోరు. ఒకరి ముందు మరొకరి పేరు ఎత్తితే చాలు ఆకాశం అంతం ఎత్తుకు ఎగురుతారు. రాజకీయం మారింది. రాజకీయ పరిస్థితులు మారాయి. గెలుపోటములే పైచేయి సాధించినంత విలువ. దాడులు..అడ్డుకోవడాలు ఏ మాత్రం సబబు కాదనే వాదన ఉంది. బట్ దాడికి ప్రతి దాడి..యాక్షన్‌కు రియాక్షన్‌ అన్నదే వాళ్ల టోన్. సో ఈ పంచాయితీ తెగదు. ఒడవదు. సీమ నేతలంటార్రా బాబు అన్నట్లుగా ఉంది పరిస్థితి.