Pawan-Tamanna Simhadri
Tamanna simhadri: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు. తమన్నా సింహాద్రి గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గానూ పాల్గొన్న చేసిన విషయం తెలిసిందే. భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తాజాగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమన్నా సింహాద్రి పోటీ చేశారు. టీడీపీ మంగళగిరి అభ్యర్థి, ఆ పార్టీ కీలక నేత నారా లోకేశ్‌పై సింహాద్రి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు.
కాగా, అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తమన్నా సింహాద్రి సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ అప్పట్లో ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో తమన్నా సింహాద్రి జనసేనలోనూ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత పోటీకి దిగారు.
Also Read : కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న కేటీఆర్