Chandrababu Lokesh Fired YCP : వైసీపీ గుండాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు, లోకేష్ ట్వీట్

మాచర్ల ఘటనపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

chandrababu

Chandrababu Fired YCP : మాచర్ల ఘటనపై గుంటూరు డీఐజీకి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ముకాయడం దారుణమని ట్వీట్ చేశారు. వైసీపీ గుండాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుందన్నారు. మరోవైపు మాచర్ల ఘటనను ఖండిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మాచర్లలో వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకలు పోలీసుల సహకారంతో మరోసారి టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులపై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దాడి చేసిన వైసీపీ గుండాలను వదిలేసి పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడం దారుణమని లోకేష్ అన్నారు.

Macherla High Tension : మాచర్లలో భయానకం.. టీడీపీ ఆఫీస్‌కు, వాహనాలకు నిప్పు.. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

పల్నాడు జిల్లా మాచర్ల గొడవలపై రాజకీయ దుమారం రేగింది. టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో గొడవ మొదలైంది. కార్లు, కార్యాలయాలు తగులబెట్టుకునేంత వరకు వెళ్లింది. రెండు వర్గాలు సరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టారు. టీడీపీ ఆఫీస్ కు మరోవర్గం నిప్పుపెట్టారు. తెలుగుదేశం పార్టీ నేత బ్రహ్మారెడ్డి ఇంటిపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో బ్రహ్మారెడ్డిని మాచర్ల నుంచి బయటకు పంపించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.