Macherla High Tension : మాచర్లలో భయానకం.. టీడీపీ ఆఫీస్‌కు, వాహనాలకు నిప్పు.. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది.

Macherla High Tension : మాచర్లలో భయానకం.. టీడీపీ ఆఫీస్‌కు, వాహనాలకు నిప్పు.. టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

Macherla High Tension : పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది.

మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు జూలకంటి బ్రహ్మారెడ్డి. వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

Also Read..Andhra Pradesh: పల్నాడు జిల్లాలో టీడీపీ ఇన్‌ఛార్జిపై దాడికి వైసీపీ యత్నం.. తిప్పికొట్టిన టీడీపీ శ్రేణులు

టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణతో మాచర్లలో భయానక వాతావరణం నెలకొంది. రాళ్లు, కర్రలతో టీడీపీ-వైసీపీ నేతలు కొట్టుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ.. మాచర్లను రణరంగంగా మార్చేశాయి. ఇదే క్రమంలో టీడీపీ ఆఫీసుకు వైసీపీ శ్రేణులు నిప్పుపెట్టాయి. ఇక రైల్వే ట్రాక్ సమీపంలో జీపుని ధ్వంసం చేసిన ఆందోళనకారులు దానికి నిప్పు పెట్టారు. మాచర్ల పట్టణంలో టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

జూలకంటి బ్రహ్మా రెడ్డి ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టడం టెన్షన్ కు దారితీసింది. ఆయన చేపట్టిన కార్యక్రమం వార్డు పూర్తిగా వైసీపీది. మీరు మా వార్డులోకి ఎందుకొచ్చారు? అని వైసీపీ నేతలు టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు.

Also Read..CM Jagan : వైసీపీలో కలకలం.. ఆ 40మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి

దాదాపు 200 మంది వైసీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో వాహనాలకు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇదంతా వైసీపీ వార్డు, ఇక్కడ ఇదేం కర్మ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు దాడులకు దిగారు. మా వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టడానికి వీల్లేదన్నారు. అటు బ్రహ్మానంద రెడ్డి ఇంటిని, టీడీపీ కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.