CM Jagan : వైసీపీలో కలకలం.. ఆ 40మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి

ఈ నెల 14న గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ కు ఇప్పటికే నివేదికలు అందాయి. ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు జగన్. పరిశీలకులు ఇచ్చిన నివేదికలను కూడా ప్రస్తావించనున్నారు.

CM Jagan : వైసీపీలో కలకలం.. ఆ 40మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి

CM Jagan : ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వం. దీనిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు జగన్. ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు చాలా సీరియస్ గా తీసుకోవాలని జగన్ ఇప్పటికే అనేకమార్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే పలు మార్లు సమీక్షలు నిర్వహించిన సీఎం జగన్ తాజాగా మరోసారి రివ్యూకి రెడీ అయ్యారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ నెల 14న గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ కు ఇప్పటికే నివేదికలు అందాయి. ఆ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు జగన్. పరిశీలకులు ఇచ్చిన నివేదికలను కూడా ప్రస్తావించనున్నారు. 30 నుంచి 40మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గడపగడపకు మన ప్రభుత్వంపై ఇదే చివరి సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది.

వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారం చేపట్టాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి దక్కాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈసారి 151 సీట్లకే పరిమితం కాకుండా 175కు 175 సీట్లూ గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

Also Read..CM Jagan Target 175 : కొత్తగా 5లక్షల 20వేల మంది నియామకం.. 175 స్థానాలే లక్ష్యంగా సీఎం జగన్ ఖతర్నాక్ స్కెచ్

ఇదే విషయాన్ని ఆయన పార్టీ శ్రేణులకు పదే పదే చెబుతున్నారు. అందుకు తగిన కార్యాచరణ కూడా సిద్ధం చేసి ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. ఇప్పుడు పార్టీ పరంగా కూడా ఇదే వ్యవస్థను రూపొందించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గ్రామ సారథులను నియమించాలని ఆదేశాలిచ్చారు జగన్. ఇలా పార్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్. నియోజకవర్గాల్లో నేతలు ఏం చేయాలో క్లియర్ గా చెబుతున్నారు.

ముఖ్యంగా మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గడప గడపకు ప్రభుత్వం పేరిట జగన్ ఓ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వెళ్లాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలా ప్రజా ప్రతినిధులను ప్రజల దగ్గరకు పంపడం ద్వారా ఎక్కడైనా కాస్త అసంతృప్తి ఉంటే అది తొలగిపోతుందని.. అదే సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ప్రజాప్రతినిధులకు తెలుస్తాయనేది జగన్ ఆలోచన. తద్వారా వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన ఆలోచించారు.

Also Read..Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్

అయితే.. కొంతమంది ప్రజాప్రతినిధులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని లైట్ తీసుకుంటున్నారని జగన్ కు తెలిసింది. ఇప్పటికే 2 సార్లు ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జగన్.. ఆ సమయంలో ఏ ఏ నేతలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎన్ని రోజులు పాల్గొన్నారు.. ఎవరెవరు అసలు పాల్గొనలేదు.. లాంటి వివరాలన్నీ క్షుణ్ణంగా వివరించారు. నేతలు జనాల్లోకి వెళ్లకపోతే టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టడం మినహా తనకు మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. అయినా కొంతమంది పట్టించుకోలేదు.

ఇప్పుడు మూడోసారి గడప గడపకు ప్రభుత్వంపై సమీక్షకు సిద్ధమవుతున్నారు. 14న జరగనున్న ఈ సమీక్షలో జగన్ కొంతమంది నేతలకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా 30 నుంచి 40 మంది ప్రజాప్రతినిధులకు సీరియస్ వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లకపోవడం, ప్రజా వ్యతిరేకత లాంటి అంశాలే ప్రాతిపదికగా ఈ సమీక్ష ఉండబోతున్నట్టు సమాచారం.