Andhra Pradesh: పల్నాడు జిల్లాలో టీడీపీ ఇన్‌ఛార్జిపై దాడికి వైసీపీ యత్నం.. తిప్పికొట్టిన టీడీపీ శ్రేణులు

పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో టీడీపీ వారికి గాయాలయ్యాయి. అయితే, ఈ దాడిని టీడీపీ తిప్పికొట్టింది.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో టీడీపీ ఇన్‌ఛార్జిపై దాడికి వైసీపీ యత్నం.. తిప్పికొట్టిన టీడీపీ శ్రేణులు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత తలెత్తింది. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించాయి. మాచర్ల పట్టణంలో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మారెడ్డితోపాటు, టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. స్థానిక మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఈ కార్యక్రమం జరిగింది.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

ఈ వార్డులో తిరుగుతుండగా, టీడీపీ కార్యకర్తలు, బ్రహ్మారెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. అయితే, టీడీపీ శ్రేణులు దాడిని ప్రతిఘటించాయి. వైసీపీ శ్రేణులను తరిమికొట్టాయి. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. వైసీపీ శ్రేణులు తమపై దాడి చేస్తున్నప్పటికీ మాచర్ల పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని టీడీపీ విమర్శించింది.