Chandrababu
Chandrababu : ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలన అంతా అవినీతిమయం అన్నారు. వైసీపీ పాలనలో నవరత్నాలు కాదు.. నవ ఘోరాలు అని విమర్శించారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని అన్నారు. ఏం సాధించారని వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
పులివెందులలో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోనూ బారికేడ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ పై ప్రభుత్వం బాదుడే బాదుడు అని పేర్కొన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ‘ప్రతీ మీటింగ్ లో నా జపం.. తప్ప వాళ్లు చేసేందేమీ లేదు’ అని ఎద్దేవా చేశారు.
Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ప్రభుత్వం అమ్మే మద్యంలో హానికర కెమికల్స్ ఉన్నాయని ఆరోపించారు. ఇష్టానుసారంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఐటీలో తనకే పాఠాలు చెబుతావా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. డేటా చోరీ అంటూ తనకే పాఠాలు నేర్పుతున్నారా? అని అడిగారు.