Chandrababu Naidu
Chandrababu : కుప్పం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారన్న చంద్రబాబు.. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అన్నారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..
నన్ను మెప్పించడం కాదు… ప్రజల్లో పని చేసిన వారికే గుర్తింపు అని చంద్రబాబు తేల్చి చెప్పారు. స్థానిక నేతల అతి విశ్వాసం వల్లే కుప్పంలో ఓటమి ఎదురైందని చంద్రబాబు అన్నారు. కాగా, మునిసిపల్ ఎన్నికల్లో ఓటమికి కుప్పం పట్టణ నేతలు కారణాలు వివరించారు. అధికార పార్టీ అరాచకాలతో పాటు సొంత పార్టీలో తప్పిదాలను అధినేతకు తెలిపారు.
Bipin Rawat : బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!
కుప్పం స్థానిక నాయకత్వంలో మార్పులు చెయ్యాలన్న కార్యకర్తల సూచనలు అమల్లోకి తెస్తానని చంద్రబాబు చెప్పారు. ఇకపై తరుచూ కుప్పంలో పర్యటిస్తానని… కార్యకర్తలకు, నేతలు ఎక్కవ సమయం ఇస్తానని చంద్రబాబు అన్నారు. కుప్పంలో ఇల్లు నిర్మించుకుని ఎక్కువ సమయం ఇవ్వాలన్న కార్యకర్తల సూచనలకు చంద్రబాబు ఓకే చెప్పారు.