Chandrababu : ఆ అధికారులకు ఇబ్బందులు తప్పవు, చంద్రబాబు వార్నింగ్

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. జడ్పీటీసి, ఎంపీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ లోనూ అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందన్నారు. హీర మండలం జడ్పీటీసీగా టీడీపీ..

Chandrababu

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. జడ్పీటీసి, ఎంపీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ లోనూ అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందన్నారు. హీర మండలం జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు 59 ఓట్ల తేడాతో తొలుత గెలిచారని, దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడిందన్నారు. ఆ తర్వాత వైసీపీ నేతల ఒత్తిడితో రీకౌంటింగ్ కు ఎలా అనుమతిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

అనంతపురం జిల్లా జూటూరు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరెడ్డి గెలిస్తే మూడుసార్లు రీకౌంటింగ్ చేసి ఒక ఓటుతో వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడతారని చంద్రబాబు హెచ్చరించారు. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.